సర్పంచ్ బరిలో మండల అధ్యక్షులు.. గెలిచేది ఎవరు..?

సర్పంచ్ బరిలో మండల అధ్యక్షులు.. గెలిచేది ఎవరు..?

SRPT: నడిగూడెం మండలం రామాపురం పంచాయతీ పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సర్పంచ్ బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఇద్దరు మండల అధ్యక్షులు కావడంతో పంచాయతీ పీఠం ఎవరికి దక్కుతుందో అని స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. బండారు వీరబాబు యాదవ్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరెడ్డి ఆ పార్టీ మండల అధ్యక్షుడు. దీంతో ఆ గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది.