రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: ఎమ్మెల్యే
BHNG: యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 4,6,8వ వార్డుల్లో, అలాగే ఆలేరు పట్టణంలోని బస్ స్టాండ్ పరిసరాల్లో భారీ జనసంద్రం మధ్య కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని పేర్కొన్నారు.