కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.