టైర్ పేలి.. డివైడర్‌ని ఢీ కొట్టిన కారు

BPT: మార్టూరులో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం కారు టైరు పేలడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అటుల్ ఆటో విజయవాడ సేల్స్ మేనేజర్ రామారావు గాయపడ్డారు. వర్షంలో ప్రయాణిస్తున్న సమయంలో ఫ్లైఓవర్ వద్ద ఘటన జరిగింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో మేనేజర్ శ్రీధర్ సురక్షితంగా బయటపడ్డారు.