పరిశ్రమలో అగ్ని ప్రమాదం
SRD: హత్నూర మండలం బోర్పట్ల శివారులోని ఎపిటోరియా యూనిట్ -1 పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని సాల్వెంట్ రికవరీ బ్లాక్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సేఫ్టీ సిబ్బంది, కొందరు కార్మికులు మంటలను ఆపే ప్రయత్నం చేస్తూ, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేశారు.