రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NGKL: కోడేరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మాచుపల్లికి చెందిన బోయ పుట్ట కురుమూర్తి (23) సోమవారం రాత్రి సింగాయిపల్లి రైస్ మిల్ దగ్గర కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతనికి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.