మాసాయిపేటలో త్రాగునీటి..కష్టాలు
MDK: మాసాయిపేటలోని ఒకటి, రెండు వార్డుల ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత కొద్దిరోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు తెల్లవారుజాము నుంచే నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొత్తగా బోరు మోటారు వేసి పైపులైన్ నిర్మించినప్పటికీ.. అవి పగిలిపోవడంతో తాగునీటిలో మురుగు నీరు కలుస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేపట్టి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.