వర్షాల వల్ల జీడి మామిడి రైతులకు భారీ నష్టం

వర్షాల వల్ల జీడి మామిడి రైతులకు భారీ నష్టం

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు జీడి పంట మొత్తం నాశనం అయ్యిందని జీడి రైతు పప్పల శ్రీనివాసరావు బుధవారం ఉదయం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పిక్కలు మొత్తం నేలకొరిగాయన్నారు. జీడి పంటపైనే తన జీవనాధారం అని, ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.