'సమాజంలో మహిళలు చురుకైన పాత్ర పోషించాలి'
కోనసీమ: సమాజంలో మహిళలు చురుకైన పాత్ర పోషించి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. అమలాపురం మండలం బండారులంక హైస్కూల్‌లో బుధవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రక్షణ అంశం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థినిలు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.