వైసీపీ‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

వైసీపీ‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

AP: పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ దుష్ర్పచారం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం రెట్టింపు చేసిందని గుర్తు చేశారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించే ప్రసక్తే లేదన్నారు. అర్హులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లాలని పేర్కొన్నారు.