ఎంపీ నిధులతో పోలీస్ శాఖకు నూతన వాహనం

ఎంపీ నిధులతో పోలీస్ శాఖకు నూతన వాహనం

NDL: శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణ కోసం, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్‌కు ఒక బొలెరో నియో వాహనాన్ని ఎంపీ నిధులతో అందజేయడం జరిగిందని MP బైరెడ్డి శబరి అన్నారు. గురువారం నంద్యాల జిల్లా కార్యాలయంలో ఆమె జెండా ఊపి బొలెరు నియోవాహనాన్ని ప్రారంభించారు. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.