కడపలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

కడపలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

కడప వన్ టౌన్ పరిధిలో నెహ్రూ పార్క్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్ నియంత్రణపై దృష్టి పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేయవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు.