విజయవాడ GGHలో అత్యవసరమైతే అవస్థలే..!
NTR: విజయవాడ కొత్త GGHలో ఉ. 9 నుంచి సా. 4 గంటల వరకు ఓపీలు చూస్తారు. 4 గంటల తర్వాత క్యాజువాలిటీ బ్లాక్ వద్ద అత్యవసర OP నమోదు, పేషెంట్ అడ్మిషన్ కోసం ఒకే కౌంటర్ ఉండడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో చికిత్స అందించకుండా ఓపీ కోసం వేచి చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.