VIDEO: పెందుర్తిలో CMRF చెక్కులు పంపిణీ
VSP: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు CMRF ద్వారా మంజూరైన రూ.3,55,013 విలువైన చెక్కులను 7 మంది బాధిత కుటుంబాలకు అందజేశారు. శనివారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.