పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని ధర్నా

ATP: కళ్యాణదుర్గం RWS కార్యాలయం ఎదుట గురువారం శ్రీరామరెడ్డి కార్మికులు, సీఐటీయు నాయకులు ధర్నా చేపట్టారు. సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్ మాట్లాడుతూ.. 30 నెలలుగా పిఎఫ్, 7 నెలల పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా పురవీధుల గుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.