VIDEO: భక్తులతో కిటకిటలాడిన కావలి పాతూరు శివాలయం

VIDEO: భక్తులతో కిటకిటలాడిన కావలి పాతూరు శివాలయం

NLR: మహాశివరాత్రి సందర్భంగా కావలి పాతూరు శివాలయంలో శ్రీ దుర్గా భ్రమరాంబిక మల్లేశ్వర స్వామికి అభిషేకాలు, వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భారీగా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.