రక్తదానం చేసి రోగి ప్రాణాలు కాపాడిన అటవీ అధికారి

రక్తదానం చేసి రోగి ప్రాణాలు కాపాడిన అటవీ అధికారి

ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో B +ve రక్తం అవసరమైన ఆత్రం మెంగుబాయి అనే రోగికి అటవీ బీట్ ఆఫీసర్ ఎం. వెంకటేష్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. సామాజిక కార్యకర్త రాజేశ్వర్ చునార్కర్ చొరవతో, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాయిచరణ్ సహకారంతో ఈ సహాయం అందింది. ఇది వెంకటేష్ చేసిన 10వ రక్తదానం కావడం విశేషం. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం గొప్ప సేవ అని తెలిపారు.