వరి పంటల పరిశీలన

వరి పంటల పరిశీలన

KMR: సదాశివనగర్ మండలంలోని ఎల్లారెడ్డి గ్రామంలో వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి కళ్యాణి పరిశీలించారు. వరిలో ప్రస్తుతం కాండం తొలుచు పురుగు మరియు పచ్చ పురుగు ఉధృతిని గమనించి దీని నివారణ కోసం క్లోరాంత్రి ప్రోనిల్ 0.5% పిచికారి లేదా తయోమితాక్సిన్ 1% గుళికలను చల్లుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల చంద్రం, వెంకట్ పాల్గొన్నారు.