జనసేన ఆధ్వర్యంలో మెగా రక్త దానం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆముదాలవలస జనసేన ఆధ్వర్యంలో మెగా రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఇంచార్జీ పి. రామ్మోహన్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఈ రక్తం అవసరం ఉందని అన్నారు. తద్వారా ఒక ప్రాణం నిలిపిన వారు అవుతారని అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, మొదలవలస రమేష్ తదితరులు పాల్గొన్నారు.