3 డకౌట్స్.. గిల్ సలహా ఆడిగా: అభిషేక్
T20 WC తొలి 3 మ్యాచుల్లోనూ అభిషేక్ శర్మ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ మ్యాచ్ తర్వాత శుభ్‌మన్ గిల్‌కి ఫోన్ చేసి సలహా ఆడిగినట్లు అభిషేక్ తెలిపాడు. అయితే నెం.1 T20 బ్యాటర్‌కు తానేం సలహా ఇవ్వగలనని గిల్ బదులిచ్చాడని, కనీసం బ్యాట్ అయినా ఇవ్వాలని ఆడిగానని అభి పేర్కొన్నాడు. దీనిపై శర్మ ఎప్పుడూ తన బ్యాట్‌తోనే ఆడుతుంటాడని గిల్ సరదాగా చెప్పుకొచ్చాడు.