VIDEO: వివాహాలతో కళకళలాడిన మహానంది క్షేత్రం
NDL: వివాహాలకు నేడు శుభదినం కావడంతో మహానంది పుణ్య క్షేత్రంలో పదుల సంఖ్యలో వివాహాలు జరిగాయి. శనివారం క్షేత్ర పరిసర ప్రాంతాలు వివాహ బంధువులతో కళకళలాడాయి. ఆలయంలోని భక్తులు పుష్కరిణులలో స్నానాలు ఆచరించి, శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం మహిళలు ఆలయ పరిసర ప్రాంతాలలో కార్తీక దీపాలు వెలిగించారు.