ఈ నెల 19న పవర్ లిఫ్టింగ్ పోటీలు
E.G: ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 19 న అండర్ -17 బాలురు, బాలికలకు పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఈవో షేక్ సలీంభాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం మండలం ఇందుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పవర్‌లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపికలు చేపడతామన్నారని ఆయన స్పశ్టం చేసారు.