మినీ గురుకులంలో ఐదుగురు ఉపాధ్యాయుల రాజీనామా
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట పంచాయతీలో గల మినీ గురుకుల గిరిజన బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ తీరుపై అసంతృప్తితో ఐదుగురు ఉపాధ్యాయులు రాజీనామా చేశారు. ఈ పరిణామంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు సమస్యలపై దృష్టి సారించి, బాలికలకు మెరుగైన విద్యను అందించాలని కోరుతున్నారు.