'ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి'

'ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి'

NLG: దేవరకొండ మండలం మైనంపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజలంతా పౌష్టికాహారం తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.