ఫుడ్ సేఫ్టీ డే అవగాహన వాక్‌థాన్

ఫుడ్ సేఫ్టీ డే అవగాహన వాక్‌థాన్

PDPL: ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఈట్ రైట్ అవగాహన వాక్‌థాన్‌ను సోమవారం స్థానిక ఐటీఐ మైదానం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సరైన ఆహారం, తక్కువ ఉప్పు-చక్కెర వినియోగం, జంక్ ఫుడ్ నివారణపై అవగాహన కల్పించారు.