అయ్యప్ప భక్తులకు GOOD NEWS
కేరళలోని అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిలక్కు పూజలకు సంబంధించి ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు(TDB) దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ సా.5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. sabarimalaonline.org ద్వారా రోజుకు 70 వేల మంది స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్లకు వండిపెరియార్, ఎరుమెలి, నిలక్కల్, పంబలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.