'జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి'

NZB: ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు కలెక్టర్ అధ్యక్షతన గిరిజల వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.