రైస్ మిల్లులపై అదనపు కలెక్టర్ తనిఖీలు
JGL: కొడిమ్యాలలో పలు రైస్ మిల్లులను జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేయాలని మిల్లర్లను ఆదేశించారు. పెండింగ్ సరఫరాలు వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి బియ్యం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.