VIDEO: 'వర్షపు నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలి'

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కేజీవీబీ పాఠశాలలో వర్షపు నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ అన్నారు. శుక్రవారం అర్వపల్లి కేజీబీవీ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రులు విద్యార్థులను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.