పెద్దాయపల్లి నవోదయ పాఠశాల మంజూరు

MBNR: జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ఎంపీ డీకే అరుణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం రాజాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.