రాజ్యాంగాన్ని నమ్మితే జగన్ అసెంబ్లీకి వస్తారు: పవన్

AP: జగన్, వైసీపీకి సొంత రాజ్యాంగం ఉన్నట్టుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే అసెంబ్లీకి రాబోమని జగన్ అంటున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని జగన్ నమ్మితే అసెంబ్లీకి వస్తారని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించనున్నట్లు వెల్లడించారు.