ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

MBNR: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు శనివారం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.