PBKS vs DC: రేపు మ్యాచ్ రద్దు?

PBKS vs DC: రేపు మ్యాచ్ రద్దు?

IPL 2025లో భాగంగా రేపు ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ సరిహద్దుకు దగ్గర్లో ధర్మశాల ఉండడంతో మ్యాచ్ నిర్వహించే విషయంలో బీసీసీఐ కేంద్రంతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, కేంద్రం ఆదేశాలతో ధర్మశాల విమానాశ్రయం మూతపడిన విషయం తెలిసిందే.