రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ 10వ డివిజన్ కాపు వాడ, 11వ డివిజన్లలో రూ.60 లక్షల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నిర్ణీత గడువులోగా శంకుస్థాపన చేసిన పనులను ప్రారంభించేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు MLA తెలిపారు.