తమలపాకు తోటలను పరిశీలించిన మాజీమంత్రి
AKP: పాయకరావుపేట మండలంలో పలు గ్రామాల్లో సాగు చేస్తున్న తమలపాకు తోటలు తుఫాన్‌కు నేలమట్టం అయ్యాయని మాజీమంత్రి, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం సత్యవరం గ్రామంలో దెబ్బతిన్న తమలపాకు తోటలను ఆయన పరిశీలించారు. రైతులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.