అప్పన్న సన్నిధిలో హీరో శర్వానంద్
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కప్పస్తంభం అలింగనం చేయించి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనాన్ని అందజేసి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.