రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా విధానం విద్యా వసతులు ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం తదితర అంశాలను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారికి నాణ్యమైన విద్య అందించాలన్నారు.