ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు

HNK: ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ ఎన్ఎస్ఆర్ హోటల్ ఎదురుగా ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. సిఐ సంతోష్, రోడ్డు సేఫ్టీ సిఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐ బృందం, పరకాల డిపో మేనేజర్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని ఇవాళ పరిశీలించారు. జాతీయ రహదారిపై సిగ్నల్ పాయింట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతునాయన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎన్‌హెచ్ అధికారులను కోరారు.