10వ తరగతి విద్యార్దులు 100% పరీక్షలకు హాజరవ్వాలి

ELR: 10వ తరగతి విద్యార్దులు 100% పరీక్షలకు హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్ష విద్యార్ధులు ఉన్నత విద్యకు మొదటి మెట్టన్నారు. కష్టపడి చదివి పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రస్ధానంలో నిలపాలని సూచించారు.