డివైడర్‌ను ఢీకొని డీసీఎం వాహనం బోల్తా
VKB: పూడూరు మండలం పరిధిలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవే పై మన్నెగూడ సమీపంలో DCM వాహనం బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న DCM డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించారు.