వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోచమ్మ బోనాలు

WGL: వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోచమ్మ తల్లి బోనాలను బుధవారం నిర్వహించనున్నారు. బోనాల పండుగను పట్టణాల్లో ఆషాఢమాసంలో చేపట్టగా, పల్లెల్లో మాత్రం శ్రావణమాసంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోచమ్మ దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. మహిళలు బోనాలను తయారుచేసి ఊరేగింపుగా తీసుకెళ్లి తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.