జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల

జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల

WNP: అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. నిన్న 1,330 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ ఫ్లో నేటికి 1,367 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.187 TMCల నీటి నిల్వ ఉంది. ఎడమ కాలువకు 138, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కులు కలిపి 210 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ఎగువ వరదపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు.