ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.2.75 లక్షలతో అదనపు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.