VIDEO: సుండుపల్లిలో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
అన్నమయ్య: సుండుపల్లి మండల సమీపంలోని కంచిపాటి వాండ్లపల్లెలో అక్రమ మట్టి రవాణా బహిరంగంగా సాగుతోంది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాతో మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ట్రాక్టర్లతో మట్టి తరలింపు జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు కళ్లుమూసుకుని ఉండడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.