'జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు'
తూ.గో జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం రాజమండ్రిలో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులుతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్‌లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు.