'గణేష్ నవరాత్రి ఉత్సవానికి శ్రద్ధలతో జరుపుకోవాలి'

JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్‌లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులకు శుక్రవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ.. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.