VIDEO: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: కలెక్టర్
వనపర్తి ఎకో పార్కులో శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో కలిసి స్వయంగా చెత్తను తొలగించారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఈ క్రతువులో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.