16న బీసీల చలో ఢీల్లీ

HYD: దేశవ్యాప్త సమగ్ర కులగణన సాధన కోసం ఈ నెల 16,17,18 తేదీల్లో "హలో బీసీ- చలో ఢిల్లీ" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ తెలిపారు.ఆదివారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. మూడు రోజులపాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.