VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలి'
KMR: బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రిలో తక్షణమే వైద్యులను నియమించాలని టీఆర్పీ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తాహీర్ డిమాండ్ చేశారు. పార్టీ బృందంతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యుడికి వినతిపత్రం సమర్పించారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు తహేర్, ఈశ్వర్ పాల్గొన్నారు.