'వినతులను పరిశీలించి పరిష్కరిస్తాం'
PPM: ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన పలు వినతులను ఆయన స్వీకరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.